చాయ్ కా అడ్డా షాప్ ను ప్రారంభించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంపల్లి, ఆగస్టు 21 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ లోని డిఎల్ఎఫ్ మెయిన్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన చాయ్ కా అడ్డా షాప్‌ను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ యువత ప్రభుత్వ ఉద్యోగాలపై ఆధారపడకుండా వ్యాపార రంగాలలో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. అలాగే మరికొందరికి ఉపాధి కల్పించాలని, యువత స్వయం ఉపాధి ద్వారా దేశాభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కైలాస సంగమేష్ గుప్తా, శ్రీనివాస్ గుప్తా, ప్రవీణ గుప్తా, నటరాజ్, సాగర్, ఆనంద్, వెంకటేష్, రాహుల్, యశ్వంత్, శ్రీనివాస్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here