శేరిలింగంపల్లి, ఆగస్టు 21 (నమస్తే శేరిలింగంపల్లి): మాజీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు శేరిలింగంపల్లి యువ నేత, బీ ఆర్ ఎస్ పార్టీ సీనియర్ లీడర్ రవీందర్ యాదవ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సహచర తెలంగాణ విద్యార్థి నేతలు తుంగ బాలు, ఆంజనేయులు, విద్యార్థి సంఘం నేతలతో పాటు హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిసి హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. రానున్న రోజుల్లో మరింత ఉన్నతంగా రాణించాలని ఆకాక్షించారు. తెలంగాణ ఉద్యమంలో ముందుండి కొట్లాడిన ఘటనలు గుర్తు చేసుకున్నారు. కెసిఆర్ బాటలో ఉద్యమ స్ఫూర్తితో కాంగ్రెస్ సర్కార్ పై అలుపెరగని పోరాటం చేస్తున్నారు అని గెల్లు శ్రీనివాస్ ను రవీందర్ యాదవ్ కొనియాడారు. రానున్న రోజుల్లో మరిన్ని బలమైన పోరాటాలు చేసేందుకు విద్యార్థులు సిద్ధంగా ఉన్నారు అని రవీందర్ యాదవ్ వెల్లడించారు. ఈ కార్యక్రమం లో బి ఆర్ ఎస్ వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వంత్, నాయకుడు కార్తీక్ రాజు తదితరులు పాల్గొన్నారు.






