శేరిలింగంపల్లి, ఆగస్టు 18 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని చందానగర్ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ ఫిర్యాదులను అందజేశారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో 4 ఫిర్యాదులు రాగా, రెవెన్యూ విభాగంలో 1, హెల్త్ అండ్ శానిటేషన్ విభాగంలో 1, ఇంజినీరింగ్ వింగ్లో 1 ఫిర్యాదు వచ్చాయి. యూసీడీ వింగ్, యూబీడీ, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఎలాంటి ఫిర్యాదులు అందలేదని సంబంధిత అధికారులు తెలిపారు. మొత్తం 7 ప్రజా వాణి ఫిర్యాదులు వచ్చాయని, వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.






