శేరిలింగంపల్లి, ఆగస్టు 17 (నమస్తే శేరిలింగంపల్లి): శ్రీ కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని కొండాపూర్ డివిజన్ పరిధిలోని కావూరి హిల్స్ లో ఉన్న శ్రీ మల్లన్న దేవాలయంలో జరిగిన శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం ఈ భుమి మీద అవతరించిన అవతార పురుషుడు శ్రీ కృష్ణ భగవానుడి జన్మదినం సందర్భంగా ప్రజలందరికీ కృష్ణాష్టమి పర్వదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ , కిట్టు యాదవ్, ఐలేష్ యాదవ్, మనీష్ యాదవ్, సాయి యాదవ్, అహ్మద్ ఖాన్, కాజా, భక్తులు తదితరులు పాల్గొన్నారు.






