శేరిలింగంపల్లి, ఆగస్టు 17 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ శిల్పారామంలో కృష్ణాష్టమి పండుగ పురస్కరించుకొని అభినయ వాణి నృత్య నికేతన్ గురువు బాల త్రిపురసుందరి శిష్య బృందం చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. భారత దేశ హితాయ, గొల్లపల్లెలో, నారాయణతే, పరమపురుషుడు, వెంకటరమణనే , ముద్దుగారే యశోద, తరంగం, నెమలి నృత్యం, శ్రీ గౌరిని, నవపరిణీతయూ అంశాలను కళాకారులూ శ్రీసౌమ్య , వెంకట్ దీక్షితులు, శ్రీయ, కోమల్, అనురిత, ఐశ్వర్య, నేత్ర, సాయి నిత్య, హారిక, యజ్ఞ, ఉదయ్, సప్తగిరి అలేఖ్య, చైత్రహాసిని , సాయిచరణ్ లు ప్రదర్శించి మెప్పించారు.






