తులసినగర్ లో పర్యటించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 12 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని తులసి నగర్ లో వరద నీరు పొంగి రోడ్ల మీద ప్రవహిస్తూ కాలనీ వాసులకు ఇబ్బందిగా ఉందన్న విషయం తెలుసుకున్నా డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం, జల మండలి అధికారులతో కలిసి సమస్యను పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఊట నీరు పొంగి డ్రైనేజీ లైన్ గుండా రోడ్లపైకి ప్రవహించడంతో నీరుతో పాటు మట్టి కూడా రోడ్డుపైకి వచ్చి కాలనీ వాసులకు సమస్య ఏర్పడిందని అన్నారు. వెంటనే వరద నీటి ప్రవాహం ఆగేలా చర్యలు తీసుకుని, రోడ్డుపై ఉన్న మట్టిని కూడా తొలగించి శుభ్రం చేయాలని సంబంధిత అధికారులకు తెలియచేసారు. ఇప్పుడున్న డ్రైనేజీ లైన్ చిన్నగా ఉండి, నివాసాలు పెరగడంతో నిత్యం నిండిపోయి సమస్య ఏర్పడుతుందని, తొందరలో పెద్ద లైన్ నిర్మించి సమస్యకు శాశ్వత పరిష్కరం చూపిస్తామని అన్నారు. కార్యక్రమంలో ఏఈ శ్రావణి, సమ్మారెడ్డి, మల్లేష్ గౌడ్, రమేష్, పోశెట్టిగౌడ్, వర్క్ ఇన్స్పెక్టర్ రవి కుమార్, సూపర్వైజర్ శివ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here