శేరిలింగంపల్లి, ఆగస్టు 11 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాజరాజేశ్వరి, ఓయూ కాలనీ, పార్క్ ఆవెన్యూ, హనీఫ్ కాలనీ, ప్రేమ్ నగర్ A బ్లాక్, ప్రేమ్ నగర్ B బ్లాక్, సిద్దిక్ నగర్, గచ్చిబౌలి MPP పాఠశాల, దుర్గం చెరువు గేట్ వద్ద , దర్గా సాయి నగర్, కాలనీలలో రూ. 7 కోట్ల 27 లక్షలతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు, పాఠశాల భవనం నిర్మాణం పనులకు కార్పొరేటర్లు హమీద్ పటేల్, రాగం నాగేందర్ యాదవ్ లతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ. 1650 కోట్ల నిధులు మంజూరు చేశారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకంలో మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో శేరిలింగంపల్లి నియోజకవర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంను అగ్రభాగాన నిలబెడుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.






