శేరిలింగంపల్లి, ఆగస్టు 10 (నమస్తే శేరిలింగంపల్లి): అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మియాపూర్‌లోని హఫీజ్‌పేట రైల్వే స్టేషన్ సమీపంలో శ్రీను అనే వ్యక్తి గత 5 సంవత్సరాలుగా ఫైర్ వుడ్ షాపును నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతను తీవ్ర గాయాల పాలవగా అతన్ని స్థానికంగా ఉన్న శ్రీకర హాస్పిటల్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందాడని వైద్యులు తెలిపారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా శ్రీనుకు తన సమీపంలో ఉన్న షాపు ఓనర్లతో గొడవలు ఉన్నాయని, బహుశా వారిలో ఎవరో ఒకరు అతన్ని హత్య చేయించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.






