శేరిలింగంపల్లి, ఆగస్టు 9 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ లోని హుడా ట్రేడ్ సెంటర్ రామాలయంలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తన జన్మదినం సందర్భంగా వేద పండితులచే ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి భగవంతుని ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం తారానగర్ లోని శ్రీశ్రీశ్రీ తుల్జ భవాని అమ్మవారి ఆశీస్సులను అందుకున్నారు. రాష్ట్ర యువజన నాయకులు రాగం అనిరుధ్ యాదవ్, రాగం అభిషేక్ యాదవ్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ జన్మదిన సందర్భంగా వృద్ధులకు, పేద వారికి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. శేరిలింగంపల్లి డివిజన్ ప్రధాన కార్యదర్శి చింతకింది రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి ఆటో యూనియన్ డ్రైవర్ లకు ఆప్రన్ లను కార్పొరేటర్ చేతుల మీదుగా పంపిణి చేశారు.
కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కు గోపినగర్ బస్తీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్ క్రేన్ తో భారీ ఎత్తున గజమాల వేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. SLVDC ప్రెసిడెంట్ గడ్డం రవి యాదవ్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్ విలేజ్ కమిటీ సమక్షంలో శాలువాలతో సత్కరించి, గజమాల వేసి కార్పొరేటర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గచ్చిబౌలి విలేజ్ ప్రెసిడెంట్ సయ్యద్ నయీమ్, గఫ్ఫర్, శ్రీకాంత్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, అభిమానుల సమక్షంలో వార్డు పార్క్ చౌరస్తా నుండి మొదలుకుని క్రేన్ తో భారీ గజమాల వేసి జన్మదిన సందర్భంగా అలంకరించిన వర్టెక్స్ కింగ్ స్టన్ పార్క్ విల్లాస్ క్లబ్ హౌస్ వరకు భారీ ఎత్తున ర్యాలీగా తరలివచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

శేరిలింగంపల్లిలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ జన్మదినం సందర్భంగా నేతలు హంగామా చేశారు. డిజె సౌండ్స్, బ్యాండ్ మేళాల నడుమ రోడ్లపై డ్యాన్సులు చేశారు. తమ అభిమాన నాయకుడి జన్మదినం సందర్భంగా ప్రధాన కూడళ్లలో భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. వేదికపై చేరుకున్న రాగం నాగేందర్ యాదవ్ ని పలువురు సన్మానించారు. స్థానిక శాసనసభ్యుడు ఆరెకపూడి గాంధీ, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, ఇతర డివిజన్ల కార్పొరేటర్లు, స్థానిక నాయకులు, శేరిలింగంపల్లి నియజకవర్గం, రాష్ట్ర నలుమూలల నుండి విచ్చేసి కార్పొరేటర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మధ్యాహ్న విందులో రాష్ట్ర నలుమూలల నుండి హాజరైన ప్రతిఒక్కరూ భోజనం స్వీకరించారు. కార్పొరేటర్ గారు మాట్లాడుతూ తన జన్మదినం సందర్భంగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు, అభిమానులు మాట్లాడుతూ శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో భవిష్యత్తులో ఉన్నతమైన పదవులను అధిరోహించాలని ప్రతి ఒక్కరూ మనసారా కోరుకున్నారు.





