శేరిలింగంపల్లి, ఆగస్టు 4 (నమస్తే శేరిలింగంపల్లి): కోకాపేట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన 3M కార్ కేర్ స్టూడియోను ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ లతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ 3M కార్ కేర్ స్టూడియే వారు తమ 3వ బ్రాంచ్ ను ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని, నల్లగండ్ల , కొంపల్లి, కోకాపేట్ ప్రాంత పరిసర ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ప్రీమియం 3M కార్ కేర్ సర్వీసులు డీటెయిలింగ్, పెయింట్ ప్రొటెక్షన్, డెంటింగ్ వంటి కార్ సర్వీస్ లు లభిస్తాయని, కస్టమర్లకు సరమైన ధరలకు, నాణ్యతా ప్రమాణాలతో సేవలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.






