శేరిలింగంపల్లి, జూలై 31 (నమస్తే శేరిలింగంపల్లి): వర్షాకాల ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎఫ్సీఐ, వీడియో కాలనీలలో డిప్యూటీ కమిషనర్ శశిరేఖ, పలు శాఖల సంబంధిత అధికారులతో కలసి పలు సమస్యలు చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ వర్షాకాల ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎఫ్సీఐ, వీడియో కాలనీలలో జిహెచ్ఎంసి పలు శాఖల సంబంధిత అధికారులతో కలసి పాదయాత్ర చేయడం జరిగిందని, కాలనీలలో ఉన్న సమస్యలను అధికారులతో కలిసి పరిశీలించి,
అధికారులతో మాట్లాడి చిన్న చిన్న సమస్యలను అక్కడిక్కడే పరిష్కరించడం జరిగిందని, వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధుల బారిన పడకుండా దోమల నివారణలో భాగంగా తీసుకోవలసిన పలు జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ప్రతి ఒక్కరు ఇంటి పరిసర ప్రాంతాలలో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, ఎఫ్సీఐ, వీడియో కాలనీలలో మౌలిక వసతులు కల్పించడమే ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు టౌన్ ప్లానింగ్ ఏసిపి నాగిరెడ్డి, డిఈ దుర్గా ప్రసాద్, శానిటేషన్ సూపర్వైజర్ శ్రీనివాస్, సి ఓ లక్ష్మీ, ఎంటమాలజి ఏ ఈ చిన్న రమావత్, శానిటేషన్ ఎస్ ఆర్ పి మహేష్, ఎస్ ఎఫ్ లు, ఎఫ్సీఐ, వీడియో కాలనీల వాసులు సుప్రజా, ఉమాకిషన్, రవీందర్ రెడ్డి, సమ్మెట ప్రసాద్, మధుసూదన్ రెడ్డి, శంకర్, విజయ్, అనిల్, హైమద్ అలీ, యూనుస్, చంద్రకళ, హరికృష్ణ, జితేందర్ శర్మ, రామకృష్ణ, శ్రీనివాస్, కాలనీ వాసులు, పలు శాఖల సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.





