మియాపూర్ ఆర్‌టీసీ 2 డిపోలో ఎస్సీ, ఎస్టీ కార్మికుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని విన‌తి

శేరిలింగంప‌ల్లి, జూలై 31 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ ఆర్‌టీసీ డిపో 2 లో నెల‌కొన్న ఎస్సీ, ఎస్టీ కార్మికుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కరించాల‌ని కోరుతూ డిపో మేనేజ‌ర్‌కు ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేష‌న్ నాయ‌కులు విన‌తిప‌త్రం అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ ఫొటోను డీఎం ఆఫీస్‌తోపాటు ఎంఎఫ్ ఆఫీస్‌, అసిస్టెంట్ మేనేజ‌ర్ ఆఫీస్‌, సెక్యూరిటీ సిబ్బంది ఆఫీస్‌లో పెట్టాల‌ని, రిప‌బ్లిక్ డే నాడు మ‌హాత్మా గాంధీ ఫొటోతోపాటు డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ ఫొటోను కూడా పెట్టాల‌ని, ఎస్సీ, ఎస్టీ కార్మికుల‌కు త‌గిన గౌర‌వం ఇవ్వాల‌ని, వారి ప‌ట్ల అమ‌ర్యాదంగా ప్ర‌వ‌ర్తిస్తే త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, మ‌హిళ‌ల పట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించే వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, ప్ర‌తి ఏటా డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ జ‌యంతి ఉత్స‌వాల‌ను నిర్వహించాల‌ని, డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని ప్ర‌తిష్టించాల‌ని కోరారు. ఇందుకు డీఎం సానుకూలంగా స్పందించార‌ని వారు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here