శిల్పారామంలో అల‌రించిన నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌లు

శేరిలింగంపల్లి, జూలై 29 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ శిల్పారామంలో అభినయ వాణి నృత్య నికేతన్ గురువు బాల త్రిపురసుందరి తండ్రి పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం వర్ధంతి సందర్బంగా గురు స్మృతిగా కూచిపూడి నృత్య నీరాజనం సమర్పించారు. వెంపటి చిన సత్యం నృత్యం సమకూర్చిన అంశాలను ప్రదర్శించారు. కౌత్వం, వసంత స్వరజతి, నటేశ కౌత్వం, దశావతారం, పలుకు తేనెల హళ్లి, వెడెలెరా వయ్యారాలు, పరులన్నమాట, తిల్లాన అంశాలను శ్రీ సౌమ్య, సంయుక్త, శ్రీయ, వెంకట్, ఇషితా, ఐశ్వర్య, సాయి చరణ్, నేత్ర, అలేఖ్య, సంజన తదిత‌రులు ప్రదర్శించి మెప్పించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here