భూగర్భ డ్రైనేజీ ఏర్పాటు చేయాలని కార్పొరోటర్ గంగాధర్ రెడ్డికి వినతి

శేరిలింగంప‌ల్లి, జూలై 25 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధి లోని గోపనపల్లి లో ఉన్న‌ మంజీర డైమండ్ హైట్స్ అపార్ట్మెంట్ వాసులు ఏర్పాటు చేసిన సమావేశానికి గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా మంజీర డైమండ్ హైట్స్ ప్రాంతంలో అసంపూర్తిగా మిగిలిపోయిన యూజీడీ పైప్ లైన్ నిర్మాణము పనులను పూర్తి చేయాలని, మంచి నీటి వసతిని మెరుగుపర‌చాలని, వీధి దీపాలు సక్రమంగా పనిచేసేలా చూడాలని, పారిశుధ్యం పనులు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డిని కోరారు. అనంతరం తమ కాలనీలో ఉన్న పార్క్ స్థలంలో ఓపెన్ జిమ్, చిల్డ్రెన్స్ పార్క్, క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు. ఈ మేరకు కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి స్పందించి వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడారు.

మంజీర డైమండ్ హైట్స్ అపార్ట్మెంట్ వాసులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా భూగర్భడ్రైనేజీ, సీసీ రోడ్డు , ఓపెన్ జిమ్, చిల్డ్రెన్స్ పార్క్, క్రీడా ప్రాంగణం వ్యవస్థ అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు వేగంగా చేపట్టి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ కాలనీలో అసంపూర్తిగా మిగిలిపోయిన యూజీడీ పైప్ లైన్ పనులను, రోడ్లను త్వరితగతిన పూర్తి చేస్తామని, మంజీర మంచీ నీటి వసతిని మెరుగుపరుస్తామని, దశల వారిగా అన్ని పనులు పూర్తి చేసి కాలనీ లో చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామని తెలియజేశారు. పెరుగుతున్న జనాభా దృష్ట్యా భూగర్భ డ్రెయినేజీ పైప్ లైన్ డయా పెంచి లెవల్స్ తో అనుసంధానం చేస్తూ ఒక‌ కాలనీ నుండి మరొక కాలనీ కి మధ్యన ఇబ్బందులు తలెత్తకుండా పనులు ప్రణాళిక బద్దంగా అన్ని కాలనీలకు దశలవారీగా మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మంజీర డైమండ్ హైట్స్ కాలనీ వాసులు పి ఆర్ రావు , అతుల్, సత్యనారాయణ, రెడ్డి, ఫణి, వెంకటేష్, అర్జుజ్, వరుణ్, సత్యనారాయణ, ప్రవీణ్, సుందర చారి , సీనియర్ నాయకులు శేఖర్ సుమన్, తిరుపతి, స్థానిక నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here