శేరిలింగంపల్లిలో విద్యాసంస్థల బంద్‌ విజయవంతం

శేరిలింగంపల్లి, జూలై 23 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలో వామపక్ష విద్యార్థి సంఘాలు ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యాసంస్థల బంద్‌ విజయవంతంగా ముగిసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూల్స్, జూనియర్ కాలేజీలలో నెలకొన్న సమస్యలను ప‌రిష్క‌రించ‌డంతోపాటు కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలు చేసే ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ తల‌పెట్టిన‌ విద్యాసంస్థల బంద్‌ విజయవంతం అయిందని అన్నారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ , అధ్యక్ష కార్యదర్శులు టీ నితీష్, ధర్మతేజ మాట్లాడుతూ కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థులను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. బకాయి ఉన్న 8 వేలకోట్ల విద్యార్థుల స్కాలర్ షిప్‌లు, ఫీజు రీయింబర్స్ మెంట్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిత్యవసర సరుకుల ధరలు పెరిగాయి కావున హాస్టల్ విద్యార్థులకు మెస్ చార్జిలు, కాస్మోటిక్ చార్జీలు పెంచాలని అన్నారు. అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల‌లో మౌలిక సదుపాయాలను కల్పించి ఆర్టీసీలో విద్యార్థులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టి గణేష్, పి సురేష్, కిరణ్, విష్ణు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here