శేరిలింగంపల్లి, జూలై 21 (నమస్తే శేరిలింగంపల్లి): రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపాలిటీ సర్కిల్లో నూతనంగా ఏర్పాటు చేసిన జాస్మిన్ హాస్పిటల్‌ను తెలంగాణ రాష్ట్ర టి ఆర్ పి ఎస్ ఫౌండర్, ప్రెసిడెంట్ డాక్టర్ వెంకట్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు తక్కువ ధరలతో కూడిన నాణ్యమైన వైద్యం అందించాలని అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మురికివాడల్లో, తండాలు, గూడెం, గ్రామాల్లో ప్రతి నెల ఒక రోజు ఉచితంగా వైద్యం అందించాలని సూచించారు. వర్షాకాంలో ప్రబలే అంటు వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు జాఫర్, మౌలాలి, అజర్, పాషా తదితరులు పాల్గొన్నారు.






