శేరిలింగంపల్లి, జూలై 20 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర సంస్కృతి , సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల పర్వదినం సందర్భంగా హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని గంగారంలో ఉన్న శ్రీ నల్లపోచమ్మ దేవాలయం, ఇంద్రా రెడ్డి ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని దేవాలయంలో జరిగిన బోనాల ఉత్సవాలలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సంస్కృతి ,సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల పర్వదినం సందర్భంగా ప్రజలందరికి బోనాల పర్వదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అని అన్నారు. అమ్మ వారి దీవెనలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని వేడుకుంటున్నాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు , కార్యకర్తలు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.






