శేరిలింగంపల్లి, జూలై 20 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో ఆదివారం బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. వాడవాడలా ఎటు చూసినా బోనాల శోభ నెలకొంది. మహిళలు బోనాలను ఎత్తుకుని వచ్చి అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా పోతురాజుల నృత్యాలు, శివసత్తుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఆలయాల్లో ఉదయం నుంచే భక్తుల సందడి నెలకొంది. అమ్మవారి ఆలయాల్లో దర్శనం కోసం భక్తులు ఉదయం నుంచే బారులు తీరారు. ఈ సందర్భంగా చందానగర్‌లోని హుడా కాలనీలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారు శాకంబరీ దేవీ అవతారంలో దర్శనమిచ్చారు.






