శేరిలింగంపల్లి, జూలై 15 (నమస్తే శేరిలింగంపల్లి): ఆషాడ మాసం సందర్భంగా మహిళలకు మెమెందీ కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ హైదరాబాద్ సనాతన మహతి ఆధ్వర్యంలో శారద నగర్ బృందావనం పార్క్ లో నిర్వహించారు. ఈ మెహేంది కార్యక్రమంలో స్థానిక మహిళలందరూ పాల్గొని తమ చేతులకు గోరింటాకు పెట్టుకుంటూ సందడి చేశారు. ఆషాడ మాసంలో మహిళలకు చేతికి గోరింటాకు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తుందని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్ అన్నారు. ఇలాంటి గోరింటాకు సంబరాలు జరుపుకోవడం చాలా సంతోషమని అన్నారు. మన సంప్రదాయాలను మర్చిపోకుండా ఇలా చేయటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా వివిధ ఆట పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.






