ఎల్ల‌మ్మ‌బండ‌లో ఆశ హాస్పిట‌ల్ ప్రారంభం

శేరిలింగంపల్లి, జూలై 15 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆశ ఆసుపత్రిని కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్ ల‌తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ పేద మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా నివసించే ఎల్లమ్మబండ ప్రాంతంలో అన్ని రకాల వసతులతో ,అన్ని హంగులతో, సకల సౌకర్యాలతో ఆసుపత్రి ని ఏర్పాటు చేయడం అభినందనీయం అని , సరసమైన ధరలతో నాణ్యమైన వైద్య సేవలు అందించాలని PAC చైర్మన్ గాంధీ తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ , దొడ్ల రామకృష్ణ గౌడ్, సమ్మారెడ్డి, జిల్లా గణేష్, శివరాజ్ గౌడ్, బోయాకిషన్, పోశెట్టిగౌడ్, మహేష్, గోపాల్, లింగం, ఆదర్శ్, వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here