శేరిలింగంపల్లి, జూలై 7 (నమస్తే శేరిలింగంపల్లి): డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలపై ప్రభుత్వం వడ్డీ మాఫీ చేయడం హర్షణీయం అని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి అన్నారు. డ్వాక్రా మహిళలు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. చందానగర్ వేముకుంట మహిళ భవన్ లో ఏర్పాటు చేసిన ఇందిర మహిళా శక్తి వేడుకలకు ముఖ్య అతిథిగా చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి హాజరుయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలపై వడ్డీ మాఫీ చేయడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. మహిళా సాధికారత కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను మహిళా సమాఖ్య సభ్యులు, టౌన్ లెవల్ ఫెడరేషన్ సభ్యులు నగరంలోని మహిళలకు వివరించి, వాటిని సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించాలని ఆమె కోరారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె ఉద్ఘాటించారు.






