హఫీజ్‌పేట (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట డివిజన్ తెరాస రెబల్ కార్పొరేటర్ అభ్యర్థిగా లక్ష్మీ బాబు మోహన్ మల్లేష్ శుక్రవారం నామినేషన్ వేశారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం తెరాస బీసీ సంఘం అధ్యక్షుడు బాబు మోహన్ మల్లేష్ మాట్లాడుతూ.. 2001 నుంచి తాము తెరాసలో పనిచేస్తున్నామని అన్నారు. సీఎం కేసీఆర్ అడుగు జాడల్లో నడుస్తూ అప్పటి నుంచే ఉద్యమంలో పాల్గొన్నామని తెలిపారు. ఈ క్రమంలోనే గత కార్పొరేషన్ ఎన్నికల్లో తమకు టిక్కెట్ ఇవ్వాలని కోరామని, కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన పూజిత, జగదీశ్వర్ గౌడ్లకు టిక్కెట్లు ఇచ్చారన్నారు. అయినప్పటికీ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి మేరకు అప్పట్లో నామినేషన్ వేసి కూడా ఉపసంహరించుకున్నామన్నారు. కానీ ఈసారి కూడా తమకు అన్యాయం చేశారన్నారు. అందుకనే రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగిందన్నారు. ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధిస్తామన్న ధీమా తమకు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.