శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): టీఆర్ఎస్ పార్టీ శేరిలింగంపల్లి డివిజన్ నుంచి టిక్కెట్ ఆశించి భంగపడ్డ రవి యాదవ్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. టీఆర్ఎస్ అధిష్టానం నమ్మించి మోసం చేసిందని రవి యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలు, అభిమానుల ఒత్తిడి మేరకు పార్టీకి రెబల్‌గా నామినేషన్ వేశానని తెలిపారు. డివిజన్లో గెలిచి తన సత్తా ఎంటో చూపిస్తానని అన్నారు.