మియాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ బిజెపి అభ్యర్థిగా స్థానిక బిజెపి నాయకుడు, కమ్మ సామజిక వర్గ నేత డిఎస్ఆర్ కె ప్రసాద్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ తాను ఎంతో కాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటూ ప్రజలకు తన సేవలను అందించినట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీ లో జిల్లా రంగారెడ్డి జిల్లా కార్యదర్శి గా, మియాపూర్ డివిజన్ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం తనకుందని తెలిపారు. వీటితో పాటు లయన్స్ క్లబ్ లో పలు పదవుల్లో కొనసాగుతూ సామజిక సేవ కార్యక్రమాలలో తన వంతు బాధ్యతను నిర్వహించానని తెలిపారు. ఇటీవల బిజెపి సిద్ధాంతాలకు ఆకర్షితుడినై బిజెపి రాష్ట్ర నాయకులు మొవ్వ నారాయణ ఆధ్వర్యంలో పార్టీలో చేరినట్లు తెలిపారు. బిజెపి అధిష్టానం తనకు టికెట్ కేటాయిస్తుందని నమ్మకం తనకు ఉందని, ఆ విశ్వసం తోనే నామినేషన్ దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు.