శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ సమావేశం..హాజరైన పార్టీ పెద్దలు

సమావేశంలో మాట్లాడుతున్న కొండాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి మహిపాల్ యాదవ్

హఫీజ్ పేట(నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం హఫీజ్ పేట్ లోని ఫ్రెండ్స్ ఫంక్షన్ హాల్ లో జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పొన్నం ప్రభాకర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మధుయాష్కీ గౌడ్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహాలపై నాయకులు దిశా నిర్దేశం చేశారు. దీంతో పాటు నియోజక వర్గం పరిధిలోని డివిజన్లకు పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వెంట రాష్ట్ర ప్రజలు ఉన్నారని, కొందరు నాయకులు పార్టీ వీడినంత మాత్రన పార్టీకి ఎలాంటి నష్టం ఉండబోదన్నారు. నియోజక వర్గ నాయకులు, కార్యకర్తలు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం శ్రమించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమం లో మండల కాంగ్రెస్ అధ్యక్షులు కోడిచెర్ల టి.కృష్ణ, నాయకులు మహిపాల్ యాదవ్, ఇలియాస్ షరీఫ్ లతో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here