సీసీ రోడ్డు నిర్మాణం ప‌ట్ల ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీకి కృత‌జ్ఞ‌త‌లు

శేరిలింగంప‌ల్లి, మార్చి 27 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మ‌దీనాగూడ‌లో ప‌లు ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు గాను పీఏసీ చైర్మ‌న్‌, శేరిలింగంప‌ల్లి ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీకి ప‌లువురు నాయ‌కులు ధ‌న్య‌వాదాలు తెలిపారు. మ‌దీనాగూడ చౌర‌స్తా నుంచి మ‌ల్ల‌న్న టెంపుల్ వ‌ర‌కు, చౌర‌స్తా నుంచి శ్రీ‌కృష్ణ ఆల‌యం వ‌ర‌కు సీసీ రోడ్ల‌ను నిర్మించాల‌ని కోరుతూ గ‌తంలో గాంధీని క‌లిసి విన‌తిప‌త్రం అంద‌జేశామ‌ని నాయ‌కుడు బోయిన్ ప‌ల్లి వినోద్ రావు తెలిపారు. ఈ సంద‌ర్భంగా త‌మ విన‌తిని అంగీక‌రించి రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసేలా చ‌ర్య‌లు తీసుకున్నందుకు గాను గాంధీని బోయిన్ ప‌ల్లి వినోద్ రావు కలిసి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో యాద‌గిరి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here