శేరిలింగంపల్లి, మార్చి 21 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో బీసీ ఉద్యమానికి మద్దతు, సహాయ సహకారాలు అందించాలని కోరుతూ ఉమ్మడి ఏపీ మాజీ పిసిసి అధ్యక్షుడు, మాజీమంత్రి రఘువీరారెడ్డి యాదవ్, మండల్ కమిటీ చైర్మన్ బిందెశ్వర ప్రసాద్ మండల్ మనవడు సూరజ్ మండల్ ను తెలుగు రాష్ట్రాల బీసీ జేఏసీ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్య వేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ కలిశారు. ఈ సందర్భంగా భేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ రాజ్యాధికారమే ముఖ్య లక్ష్యంగా బీసీల ఓట్లు బీసీలకు అని సామాజిక న్యాయం కోసం ప్రమాణ పూర్వకంగా పనిచేస్తామని అన్నారు.

తెలుగు రాష్ట్రాలు రెండు కాకుండా భారతదేశంలోని అనేక రాష్ట్రాలలో పేదరికంలో మగ్గుతున్న బడుగు బలహీన వర్గాల గురించి బీపీ మండల్ సిఫారసు చేసిన 40 సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ నాయకులు ఒట్టే జానయ్య యాదవ్, యాదవ రాజ్యాధికార సమితి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు బడుగుల నాగార్జున యాదవ్, వెంకటేష్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, నగేష్ యాదవ్, రాఘవేందర్ యాదవ్, బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్, కృష్ణ గౌడ్, అశోక్ పద్మశాలి, రజక సంఘం మూర్తి, నాయి బ్రాహ్మణ సంఘం కిషోర్, బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.






