శేరిలింగంపల్లి, మార్చి 21 (నమస్తే శేరిలింగంపల్లి): ఎలాంటి అనుమతులు లేకుండా భారీ గుంత తవ్వి రోడ్డు పక్కన మట్టి పోసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ శేరిలింగంపల్లి ఉపాధ్యక్షుడు మిద్దెల మల్లారెడ్డి సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు. చందానగర్ డివిజన్ పరిధిలోని అమీన్ పూర్ వెళ్లే దారిలో ఉన్న బచ్ పన్ స్కూల్ పక్కన ఎలాంటి అనుమతులు లేకుండా భారీ గుంత తీసి మట్టిని రోడ్డుపైన గుట్ట లాగా పోశారని అన్నారు. దీని వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఆ దారిలో రాకపోకలు సాగిస్తున్న వాహనదారులకు, పాదచారులకు ఈ మట్టి వల్ల ఇబ్బంది తలెత్తుతుందని, వెంటనే బిల్డర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.