బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాములు యాదవ్ కి ఘ‌న స‌న్మానం

శేరిలింగంప‌ల్లి, మార్చి 16 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): జాతీయ యాదవ్ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ కి దక్షిణాది రాష్ట్రాలు అన్ని కలిసి ఆయ‌న‌ సేవలను గుర్తించి యాదవ యుద్ద నౌక నేషనల్ అవార్డును బహుకరించిన సంద‌ర్భంగా ఆయ‌న‌ను బీహెచ్ఈఎల్‌లో యాదవ సంఘం, బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ ఘ‌నంగా స‌న్మానించారు. ఈ సంద‌ర్భంగా రామ‌చంద్ర యాద‌వ్ మాట్లాడుతూ యాదవ సమాజానికే కాకుండా బీసీ కులాలైన వెనుకబడ్డ కులాలు, ఎంబిసి కులాలు, కొంతవరకు అభివృద్ధి చెందిన కులాలకు కూడా రాములు యాద‌వ్ అనుభవాన్ని ఉపయోగించి అందరికీ సేవ చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో శెట్టి వంశీ మోహన్ యాదవ్, మాజీ కౌన్సిలర్ ఫోర్ లీడర్ రామస్వామి యాదవ్, వీర్ల ప్రకాష్ రావు యాదవ్, గోకుల్ యు ఫౌండర్ నెర్సు శ్రీధర్ యాదవ్, బసవరాజు యాదవ్, యాదవ్ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాములేటి యాదవ్, సీనియర్ యాదవ్ సంఘం నాయకులు నందగోపాల్ యాదవ్, అందెల కుమార్ యాదవ్, సైదులు యాదవ్, చీపిరి మల్లేష్ యాదవ్, డొక్కు వెంకటేశ్వర్లు, బసవరాజు యాదవ్, శ్రీశైలం యాదవ్, శ్రీనివాస్ యాదవ్, రవి యాదవ్, ఐలాపూర్ మాణిక్ యాదవ్, ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి డబ్బు కొట్టు హరిబాబు యాదవ్, మధు యాదవ్, సుబ్బయ్య యాదవ్, శ్రీనివాస్ యాదవ్, సిహెచ్ యాదవ్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here