శేరిలింగంప‌ల్లి డివిజ‌న్ బ‌రిలో బీజేపీ నుంచి ఎం.శివకుమార్ ?

శేరిలింగంప‌ల్లి‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణ ఉద్యమకారుడు, బీజేపీ సీనియర్ నాయకుడు ఎం.శివకుమార్ శేరిలింగంపల్లి డివిజ‌న్‌ నుంచి బీజేపీ త‌ర‌ఫున కార్పొరేట‌ర్ అభ్య‌ర్థిగా బరిలో ఉన్నట్టు విశ్వనీయ వర్గాల ద్వారా తెలిసింది. టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చి గెలుపొందేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఇంతకు ముందు ఉమ్మడి శేరిలింగంపల్లి డివిజ‌న్ అధ్యక్షుడిగా ప‌ని చేసిన అనుభ‌వం ఆయ‌న‌కు ఉంది. అలాగే పాత టీఆర్ఎస్ క్యాడర్ తోనూ ఆయ‌న స‌త్సంబంధాలు క‌లిగి ఉన్నారు. దీంతో ఆయ‌న ఎలాగైనా శేరిలింగంప‌ల్లి డివిజ‌న్‌కు బీజేపీ త‌ర‌ఫున కార్పొరేట‌ర్ టిక్కెట్ తెచ్చుకుని గెలిచే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న పార్టీ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డిని కలిసి త‌న‌కు శేరిలింగంప‌ల్లి డివిజ‌న్ బీజేపీ కార్పొరేట‌ర్ గా పోటీ చేసేందుకు అవ‌కాశం క‌ల్పించాల‌ని కోరుతూ బ‌యోడేటాను, విన‌తిప‌త్రాన్ని అంద‌జేశారు.

బీజేపీ జిల్లా అధ్య‌క్షుడు సామ రంగారెడ్డికి విన‌తిప‌త్రం అంద‌జేస్తున్న శివ‌కుమార్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here