శేరిలింగంపల్లి, డిసెంబర్ 7 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రజాపాలన విజయోత్సవ వేడుకల్లో భాగంగా మదీనాగూడలో ఏర్పాటు చేసిన సే నో టు డ్రగ్స్, వుమెన్ సేఫ్టీ, చైల్డ్ సేఫ్టీ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో విజయోత్సవాల కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్, తెలంగాణ రాష్ట్ర టిజిటిఎస్ చైర్మన్, టీపీసీసీ సోషల్ మీడియా చైర్మన్ మన్నే సతీష్ కుమార్, ఎంబిసి చైర్మన్ జేరిపేటి జైపాల్, షి టీమ్స్ సిఐ సునీత, మియపూర్ సిఐ క్రాంతి కుమార్, ట్రాఫిక్ డిపార్ట్మెంట్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.