సిద్దిక్ న‌గ‌ర్‌లో ప‌క్క‌కు ఒరిగిన భ‌వ‌నం.. తృటిలో త‌ప్పిన పెను ప్ర‌మాదం..

శేరిలింగంపల్లి, న‌వంబ‌ర్ 20 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని కొండాపూర్ డివిజన్ సిద్దిక్ నగర్ బస్తీలో 2 సంవ‌త్సరాల క్రితం నిర్మించిన 5 అంతస్థుల భవనం ఒక‌ పక్క‌ అకస్మాత్తుగా కుంగిపోయింది. అయిన‌ప్ప‌టికీ తృటిలో పెను ప్రమాదం తప్పి పోయింది. దీంతో స్థానికులు ఒక్క‌సారిగా భ‌యాందోళ‌న‌ల‌కు లోన‌య్యారు. స‌రైన నాణ్య‌తా ప్రమాణాలు పాటించ‌కుండా భ‌వ‌నం నిర్మించిన‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే హైడ్రా అధికారులు, డీఆర్ఎఫ్ బృందాలు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ప‌రిస్థితిని ప‌రిశీలించారు. భ‌వ‌నం చుట్టు ప‌క్క‌ల నివాసాల్లోని ప్ర‌జ‌ల‌ను ఖాళీ చేయించారు.

భ‌వ‌నం ప‌క్క‌కు ఒరిగిన దృశ్యం

కాగా ఈ విషయం తెలిసిన వెంటనే స్థానిక నాయకులు, మాదాపూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్, ఇతర అధికారులతో కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ సంఘ‌ట‌నా స్థలానికి చేరుకుని ప‌రిశీలించారు. బాధిత కుటుంబాల‌కు భ‌రోసా క‌ల్పించారు.

స్థానికుల‌తో మాట్లాడుతున్న జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here