బ‌తుక‌మ్మ వేడుక‌ల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 4 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులకు, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఆడపడుచులందరికీ PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ బతుకమ్మ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో బతుకమ్మ పర్వదినం సందర్భంగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మండలి డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్, ప్రభుత్వ విప్ లు జాటోత్ రామచంద్రు నాయ, ఆది శ్రీనివాస్, లెజిస్లేచర్ సెక్రెటరీ డాక్టర్ నర్సింహా చార్యులు, సీఎల్పీ సెక్రటరీ శ్రీకాంత్, శాసన సభ పరిషత్ మహిళా ఉద్యోగులతో కలిసి ఆరెకపూడి గాంధీ బతుకమ్మ వేడుకలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ తెలంగాణ ఆచార, సంస్కృతి, సంప్రదాయాలకు, ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీక తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ పర్వదినం అని, అతి పవిత్రమైన పండుగ బతుకమ్మ అని అన్నారు. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై తొమ్మిది రోజుల పాటు తీరొక్క పూలతో జరుపుకునే ఈ గొప్ప పండుగ సందర్భంగా మ‌హిళ‌లంద‌రికీ బతుకమ్మ పర్వదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అని అన్నారు.

కార్క‌క్ర‌మంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here