శేరిలింగంపల్లి, అక్టోబర్ 4 (నమస్తే శేరిలింగంపల్లి): బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్, బీసీ కమిషన్ మెంబర్ తిరుమలగిరి సురేందర్ లను ఖైరతాబాద్ లోని వారి ఆఫీసులో ఆర్‌టీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి చంటి ముదిరాజ్,రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సూర స్రవంతి, రాష్ట్ర కార్యదర్శి గుండెల రాయుడు కలిశారు. సమాచార హక్కు చట్టాన్ని బలోపేతం చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని బీసీ కమిషన్ ఛైర్మన్ ని కోరారు. అక్టోబర్ నెల చివరలో నిర్వహించే ఆర్టీఐ ఆవిర్భావ వేడుకలకు, అవగాహన సదస్సుకు హాజరుకావాలని ఆహ్వానించారు. రాష్ట్రంలో ప్రజలకు, విద్యార్థులకు ఆర్టీఐ అవగాహన సదస్సులు పెట్టి ప్రజలను మరింత చైతన్యవంతులను చేయాలని, దీనికి సహాయ సహకారాలు కావాలని విన్నవించారు. దీనికి ఆయన ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ప్రజలకు ఆర్టీఐ గురించి వివరించే కార్యక్రమం పెట్టడం చాలా బాగుంటుందని సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆర్టీఐ బృందం ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.