శేరిలింగంపల్లి, అక్టోబర్ 4 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తాండ్ర రాంచందర్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్ వేడుకల్లో పాల్గొని రాంచందర్ గౌడ్ తో కేక్ కట్ చేయించారు. అనంతరం ఆయనకు జగదీశ్వర్ గౌడ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాయకులు విజయ్ ముదిరాజ్, రవి గౌడ్, శంకర్ గౌడ్, నవీన్ నేత, శ్రీనివాస్, హీరవర్ణన్ పాల్గొన్నారు. అదేవిధంగా మియాపూర్ ఆలయ కమిటీ, మియాపూర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలోనూ రాంచందర్ గౌడ్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా రాంచందర్ గౌడ్ దుర్గాదేవి పూజలో పాల్గొన్నారు.