శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): బీజేవైఎం రాష్ట్ర నాయకుడు స్వామి వివేకానంద యూత్ క్లబ్ ఫౌండర్ నందనం విష్ణు దత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశుడి నిమజ్జనంలో 25కేజీల లడ్డూను రూ.7.30 లక్షలకు నారాయణఖేడ్ మాజీ MLA మహారెడ్డి భూపాల్ రెడ్డి కుమార్తె మహారెడ్డి శ్రేయ రెడ్డి దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో సినీ నటులు రమణారెడ్డి, గిరి, బీజేపీ నాయకులు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.