శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): నందిగామలోని గౌడ హాస్టల్ భవన నిర్మాణానికి చందానగర్ సాయి ట్రావెల్స్ అధినేత బాదం సాయి బాబు గుప్తా రూ.25 వేలు విరాళం అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ మిత్రుడు, లయన్స్ క్లబ్ ప్రముఖుడు, శేరిలింగంపల్లి గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షుడు దొంతి లక్ష్మీనారాయణ గౌడ్ నిరుపేద గౌడ విద్యార్థుల విద్యాభ్యున్నతి కోసం నందిగామ గ్రామంలో కోట్ల రూపాయల విలువచేసే తన స్థలాన్ని విరాళంగా ఇవ్వడం తనకు ఎంతో ప్రేరణ కలిగించిందని అన్నారు. ఈ క్రమంలోనే తన వంతు సహకారంగా రూ.25 వేలను గౌడ హాస్టల్ నిర్మాణానికి ఇవ్వడం జరిగిందని అన్నారు. ఆ విరాళంకు సంబంధించిన చెక్కును లక్ష్మీనారాయణ గౌడ్ కు అందజేశారు.