గచ్చిబౌలి, సెప్టెంబర్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో గణేష్ నిమజ్జనోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని కొండాపూర్ మసీదుబండ శ్రీకృష్ణ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేషుడికి నిమజ్జన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నియోజకవర్గం బీజేపీ ఇన్‌చార్జి రవికుమార్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అత్యంత కోలాహలంగా నిమజ్జనోత్సవం నిర్వహించారు.