మియాపూర్, సెప్టెంబర్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ యువకుడు అదృశ్యం అయిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మియాపూర్‌లోని గోకుల్ ఫ్లాట్స్‌లో నివాసం ఉంటున్న రామరాజు కుమారుడు తనీష్ వర్మ (20) సెప్టెంబర్ 12వ తేదీన ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తిరిగి రాలేదు. దీంతో చుట్టు పక్కల, తెలిసిన వారు, బంధువులు, స్నేహితుల వద్ద అతని ఆచూకీ కోసం విచారించినా ఫలితం లేకపోవడంతో రామరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.