శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రజలందరూ వినాయక చవితి పండుగను భక్తి, శ్రద్ధలతో జరుపుకోవాలని సీనియర్ నాయకుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ అన్నారు. శుక్రవారం హఫీజ్‌పేటలోని హనుమాన్ ఆలయం వద్ద ప్రజలకు మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ హితంగా ఉండాలంటే మట్టితో తయారు చేసిన గణేషులనే పూజించాలని అన్నారు. ప్రకృతితో మమేకం అయ్యేందుకే వినాయక చవితి పండుగను ప్రజలు జరుపుకుంటారని, అందుకని మట్టి వినాయకులనే పూజించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నరేందర్ గౌడ్, వెంకటేష్ ముదిరాజ్, దేవిముదిరాజ్, రాజ గౌడ్, విస్‌డమ్ స్కూల్ ప్రిన్సిపాల్ చారి, సాయి, శ్రీధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.