శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): పేద మహిళలకు చేయూతనివ్వాలనే ఉద్దేశ్యంతో హోప్ ఫౌండేషన్ ఛైర్మన్ కొండా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పలువురు మహిళలకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ చేతుల మీదుగా బుధవారం కుట్టు మిషన్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ.. హోప్ ఫౌండేషన్ ఛైర్మన్ కొండా విజయ్ కుమార్ పేదలకు చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. సమాజంలోని పేదలకు చేయూతను అందించేందుకు దాతలు ముందుకు రావాలన్నారు. కొండా విజయ్ కుమార్‌ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. పేదల కోసం ఏదో ఒకటి చేయాలనే తపన కలిగి ఉండడం గొప్ప విషయమని అన్నారు. కొండా విజయ్ కుమార్ ఇలాగే సేవలు అందించాలని అన్నారు.






