నమస్తే శేరిలింగంపల్లి: మండల్ కమీషన్ చైర్మన్ బి.పి.మండల్ వారోత్సవాల వేడుకలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా పదవ రోజు హెచ్.బి.కాలనీ లో బి.సి.సంక్షేమ సంఘం నాయకులు దొంతిబోయిన శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్య వేదిక అధ్యక్షులు భేరి రామచంద్ర యాదవ్ పాల్గొని మాట్లాడారు. మండల్ కమీషన్ రిపోర్ట్ ప్రకారం 40 పాయింట్లు అమలు పరచాలని, అందుకోసం జీ.వో.లను వెంటనే విడుదల చేయాలని, కేంద్రం , తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. బీసీ లకు లోకల్ బాడి ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు. రాబోయే లోకల్ బాడి ఎన్నికలలో బి.సిలు కార్పొరేటర్, మేయర్, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పిటిసిలుగా పోటీ చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీ సీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్ , నక్క శ్రీనివాస్ యాదవ్, అడ్వకేట్ రమేష్ యాదవ్ , సర్వేష్ యాదవ్, నర్సింగ్ ముదిరాజ్, సంతోష్ యాదవ్ బీసీ సంఘాల నాయకులు , అభిమానులు కార్యకర్తలు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.