దేశ ప్రగతిలో.. అభివృద్ధిలోనూ అందరూ భాగం కావాలి : చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి

  • హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొన్న చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి : దీపాంజలి స్కూల్ ఫర్ ఎక్సెల్లెన్స్ ఇన్ కూచిపూడి ఆధ్వర్యంలో మాదాపూర్ డివిజన్, హై టెక్ సిటీ వద్ద హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించారు. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, సంగీత్ నాటక్ అకాడమీలతో కలిసి ప్రారంభించిన ఈ కార్యక్రమంలో చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు.

దీపాంజలి స్కూల్ ఫర్ ఎక్సెల్లెన్స్ ఇన్ కూచిపూడి ఆధ్వర్యంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో జాతీయ జెండా ఊపుతూ…చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవికుమార్ యాదవ్, స్కూల్ బృందం

డప్పు కళాకారుల నృత్యాల నడుమ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి స్వచ్ఛందంగా అందరూ ముందుకు రావడం చాలా గర్వంగా ఉందన్నారు. వికసిత్ భారత్ వైపుగా పరుగులు పెడుతున్న మన దేశ ప్రగతిలో.. అభివృద్ధిలోనూ భాగం కావాలని పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్రం కోసం పోరాడిన ఎందరో మహానుభావుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కొనసాగించాలని ఆకాంక్షించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here