నమస్తే శేరిలింగంపల్లి : చీరాల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరపున పోటీచేసి ఘనవిజయం సాధించిన శాసనసభ్యులు మద్దుర్ల మాల కొండయ్య యాదవ్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి డప్పు కొట్టు హరిబాబు యాదవ్ ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా డప్పు కొట్టు హరిబాబు యాదవ్ మాట్లాడుతూ అత్యధిక మెజారిటీతో గెలుపొందినందుకు తమకు ఎంతో సంతోషంగా ఉందని, చీరాల ప్రజలు అండగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా తెలంగాణ బీసీ ఐక్య వేదిక చైర్మన్ బేరి రామచంద్ర యాదవ్, బిల్డర్ ప్రసాద్ యాదవ్, సురేష్ యాదవ్ గోపి యాదవ్ బిల్డర్ శివ నరసింహారావు పాల్గొని ఎమ్మెల్యేకి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్లాడుతూ ఏ సమస్య ఉన్నా తమకు తెలపాలని, ఆ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని తెలిపారు.