జోనల్ కమిషనర్ అభిలాష అభినవ్ ఐ.ఏ.ఎస్ ని కలిసి సమస్యలపై చర్చించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి : కూకట్ పల్లి జోనల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ అభిలాష అభినవ్ ఐ.ఏ.ఎస్ ని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మర్యాద పూర్వకంగా కలిశారు. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి వెళ్లి శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని వివేకానంద నగర్, ఆల్విన్ కాలనీ, హైదర్ నగర్, కూకట్ పల్లి (పార్ట్) డివిజన్ల లో నెలకొన్న పలు సమస్యలు చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై చర్చించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని డివిజన్లలో పెండింగ్ లో ఉన్న పనులు త్వరితగతిన పూర్తయ్యేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని, అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని, అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని, పనులలో వేగం పెంచాలని సకాలంలో నిధులు మంజూరు అయ్యేలా చూడాలని, అభివృద్ధి పనులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆమె దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అంతేకాక వర్షాకాలంలో ఎదురయ్యే సమస్యల పట్ల పూర్తి స్థాయిలో సన్నద్ధం అయ్యేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని, మాన్ సున్ సిబ్బందిని అప్రమత్తంగా ఉండేలా చూడాలని, అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని, రోడ్ల మరమ్మత్తులు చేపట్టాలని జోనల్ కమిషనర్ అభిలాష అభినవ్ తెలపగా సానుకూలంగా స్పందించారు.