నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని ఖాజాగుడ పెద్ద చెరువు బఫర్ జోన్ లో అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు అందుకున్న జీహెచ్ఎంసీ అధికారులు ముందుకు కదిలారు.
శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ స్నేహ శబరిష్ ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ సిబ్బంది సదరు అక్రమ నిర్మాణాలకు నోటీసులు జారీ చేసి వాటిని కూల్చివేశారు. విలువైన చెరువు స్థలాలలో అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదని, చెరువు స్థలాల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే కట్టిన చర్యలు తప్పవని జెడ్ సీ హెచ్చరించారు.