నమస్తే శేరిలింగంపల్లి : అన్నమయ్యపురంలో అన్నమాచార్య భావనా వాహిని అధ్యక్షులు పద్మ శ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ శోభా రాజు సారధ్యంలో శనివారం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఇందులో భాగంగా మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 2:30 గంటల వరకు అన్నదానం, సాయంత్రం 5గంటలకు తొలుత విష్ణు సహస్రనామం, లక్ష్మీ అష్టోత్తరం, అన్నమయ్య అష్టోత్తరం, “శ్రీ నందకాయ” అన్నమ గాయత్రి “శ్రీ మద్వదీయ” అన్నమయ్య గురుస్తుతితో ప్రారంభించారు.
అనంతరం ” శ్రీకృతి కూచిపూడి డాన్స్ అకాడమీ” గురువు లలిత రమేష్, అతడి శిష్య బృందృం “సంజన, అపర్ణ శ్రీ విధిఘ్న్య, జాహ్నవి, అనూహ్య, శాన్వి, దీత్య శివరామకృష్ణన్, చిన్మయి, జాహ్నవి నాగ వరద, శాన్వి, శ్రీ సన్నిధి, అక్షిత, శివాన్షి, రేష్మ కౌశిక, కనిష్క, అనులేఖ, జోషిత, విద్య, కౌశిక దుర్గ, మనిద్వీప, హరిని, తనుశ్రీ, హస్విత, సుదీప్తి, తేజశ్రీ, పి. శ్రీ కృతి, కృతిక” సంయుక్తంగా అన్నమయ్య సమేత శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామికి “వినాయక కౌతం, వినరో భాగ్యము, అలరులు కురియగా, దేవ దేవం భజే, బ్రహ్మ మొక్కటే, తిరు తిరు జవరాల, శుద్ధ బ్రహ్మ, రామ చరితం, పవన పురుషుడు, జగడపు చలపుల” అనే ప్రఖ్యాత సంకీర్తనలకు నృత్య ప్రదర్శనతో తమ తమ ప్రతిభతో అందరిని అలరించి స్వామికి ఘనంగా కూచిపూడి నృత్యం నివేదించారు. తదనంతరం సంస్థ అధ్యక్షులు డా. శోభా రాజు కళాకారులని శాలువా, జ్ఞాపికతో సత్కరించారు.