నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ డివిజన్ పరిధిలోని బాలాజీ నగర్ కాలనీలోని బాలాజీ అపార్ట్ మెంట్స్ అసోసియేషన్ సభ్యులు, డోవ కాలనీ వాసులు కాలనీలలో పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యులు ఉప్పలపాటి శ్రీకాంత్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.
అనంతరం అక్కడ చేపట్టవలసిన పనులపై వినతిపత్రం సమర్పించారు. దీనిపై కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ బాలాజీ నగర్ కాలనీలోని బాలాజీ అపార్ట్మెంట్స్ లో నెలకొన్న డ్రైనేజీ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని, డోవ కాలనీల ప్రజలకు అందుబాటులో ఉంటూ (వరద నీటి కాలువ) రోడ్లు, డ్రైనేజి, తాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బాలాజీ అపార్ట్ మెంట్స్ అసోసియేషన్ సభ్యులు డాక్టర్ కౌస్తుబ్ శర్మ, రాజశేఖర్ రెడ్డి, నరసింహ రెడ్డి, వెంకట్, చైతన్య, నాగబాబు, ఉమాశంకర్, నరేంద్ర, డోవ కాలనీ వాసులు కోటయ్య, పద్మనాభయ్య, మురళీ, రమేష్, రమణయ్య పాల్గొన్నారు.