స్వచ్ఛందంగా కాంగ్రెస్ లో చేరికలు

  • కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న బీఆర్ఎస్, బీజేపీ నాయకులు, సభ్యులు
  • సాదరంగా ఆహ్వానించిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి : ప్రజాపాలనకు ఆకర్షితులై పలు పార్టీల నుంచి స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముందుకొస్తున్నారు. ఇందులో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ నాయకుడు కొడాలి శ్రీధర్ ఆధ్వర్యంలో హాఫీజ్ పెట్ డివిజన్ ప్రజయ్ సిటీ నుండి బీఆర్ఎస్, బీజేపీ నాయకులు, సభ్యులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ కండువా కప్పి ఆహ్వానించారు.

ప్రజయ్ సిటీ నుండి పార్టీలో చేరిన బీఆర్ఎస్, బీజేపీ నాయకులు, సభ్యులను సత్కరించి కరచాలనం చేస్తున్న శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్

పార్టీలో చేరిన వారిలో డి.శ్రీనివాస్, రవి, నాగేశ్వరరావు, శ్రీనివాస్, గాంధీ, రవి కుమార్, రాంబాబు, రామేశ్వర్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, రవీందర్ రాజు, హుస్సేన్, యాకేశ్, అభిషేక్, కుమార్, రవి, రామ్, సాయి, కౌశిక్, శంలాల్, నాగప్రసాద్ గుప్త, సత్యనారాయణ, శ్రీనివాస్ రావు, ప్రసాద్, సుబ్బారావు, రఘునాథ్, సుబ్బా రెడ్డి, జావీద్, నవాజ్, నారాయణ, నవీన్, ప్రసాద్, శ్రీనివాస్ రెడ్డి, ప్రభాకర్, సరోజిని రెడ్డి, కల్పన, ప్రభాకర్, భార్గవి, శ్రీలత, శివ ఉన్నారు. ఈ కార్యక్రమంలో వీరేందర్ గౌడ్, మన్నెపల్లి సాంబశివరావు, కట్ట శేఖర్ రెడ్డి, ఆశీల శివ కుమార్, రాంబాబు, ప్రసాద్ పాల్గొన్నారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గ నాయకుడు కొడాలి శ్రీధర్ ఆధ్వర్యంలో పార్టీలో చేరిన బీఆర్ఎస్, బీజేపీ నాయకులు, సభ్యులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here