- అంజయ్యనగర్, సిద్దిక్ నగర్ బస్తీలలో విస్తృత ప్రచారం
నమస్తే శేరిలింగంపల్లి : చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సేవ చేస్తానని రవి కుమార్ యాదవ్ శేరిలింగంపల్లి బీజేపీ ఇన్ చార్జి రవికుమార్ యాదవ్ తెలిపారు. కొండాపూర్ డివిజన్ డివిజన్ అంజయ్యనగర్, సిద్ధిక్ నగర్ కాలనీలో డివిజన్ అధ్యక్షులు ఆంజనేయులు, రాజు రవి సాగర్, సంతోష్ , రాజేందర్ రెడ్డి , నాగరాజ్, బళ్ళు, పద్మ , సరోజా రెడ్డి, పార్వతి, నవీన్ రెడ్డి శరణ్య ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు.
ఈ సందర్భంగా రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రజాసేవ కోసమే కొండా విశ్వేశ్వర్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారని, మే 13న జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల మాటలకు కాలం చెల్లిందన్నారు.
తెలంగాణ ప్రజలను ఆ పార్టీ గ్యారెంటీల పేరు చెప్పి మోసం చేసిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు నోటికొచ్చిన వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ డివిజన్ అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా పద అధికారులు, బీజేవైఎం, మహిళా మోర్చా, మొదలగువారు ఈ పాదయాత్ర పాల్గొన్నారు.